Telangana: మొబైల్స్ రికవరీలో సైబరాబాద్‌ పోలీసుల రికార్డ్‌.. ఒక నెలలోనే రూ.2కోట్ల విలువైన..

|

Oct 24, 2024 | 8:28 AM

చోరీ అయిన మొబైల్స్ రికవరీ చేయడంలో హైదరాబాద్‌ పోలీసులు రికార్డు సృష్టించారు. ఒక నెలలో ఏకంగా 2కోట్ల విలువైన సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Telangana: మొబైల్స్ రికవరీలో సైబరాబాద్‌ పోలీసుల రికార్డ్‌.. ఒక నెలలోనే రూ.2కోట్ల విలువైన..
Lost Mobiles
Follow us on

తక్కువకు వస్తున్నాయని సెల్ ఫోన్లను కొనవద్దని, దొంగతనం అయిన ఫోన్లు కొన్నా.. కలిగి ఉన్నా నేరమేనని హెచ్చరించారు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహారెడ్డి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం అయిన, పోగొట్టుకున్న 800 ఫోన్లను బాధితులకు అప్పగించారు. వీటిలో ఐ ఫోన్లతో పాటు పలు విలువైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. దాంతో.. హైదరాబాద్ సిటీలో చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికార్డు సృష్టించారు. తాజాగా.. ఒక నెలలోనే రెండు కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు. దాదాపు 50 మంది సైబర్ క్రైమ్‌ టీమ్‌ శ్రమించి.. చోరీకి గురైన సెల్ ఫోన్లు , పోగొట్టుకున్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా సెల్ ఫోన్లు చోరీ, మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను కనిపెట్టి రికవరీ చేశారు. ఈ సందర్భంగా.. గతంలో చైన్ స్నాచింగ్‌లు, ఇళ్లల్లో దొంగతనాలు జరిగేవి.. కానీ.. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ల దొంగతనాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు డీసీపీ నరసింహారెడ్డి. రద్దీ ప్రదేశాల్లో దొంగలు మొబైల్స్‌ చోరీ చేస్తున్నారని.. అలా రోజుకు చాలామంది ఫోన్లు దొంగతనానికి గురవుతున్నాయన్నారు. సైబరాబాద్‌లో చోరీకి గురై.. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఫోన్లను తిరిగి తెప్పించినట్లు వెల్లడించారు. అయితే.. కొందరు ఫోన్లు సంవత్సరం తర్వాత దొరకగా.. మరికొన్ని మాత్రం 15 రోజుల్లోనే రికవరీ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతల్లో 1,760 ఫోన్లు రికవరీ చేశామన్నారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ నరసింహారెడ్డి అభినందించారు. అటు.. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..