ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..

| Edited By: Srikar T

Jul 26, 2024 | 3:40 PM

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు.

ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
Cyber Attack
Follow us on

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు నిన్న ఒక్క రోజే ముగ్గురి నుంచి రెండు కోట్ల రూపాయలకి పైగా కాజేసారు.

పటాన్ చెరులో నాగార్జున అనే వ్యక్తికి లేడి వాయిస్‎తో బురిడీ కొట్టించి లక్షలు కాజేశారు. అమీన్ పూర్‎లో నివాసం ఉండే ఓ ప్రయివేటు ఉద్యోగి నుంచి రూ.98 లక్షల 40 వేలు మాయం చేసారు. అలాగే తూప్రాన్‎లో ఓ యువతికి తెలియకుండానే లోన్ తీసుకుని.. అకౌంట్ నుంచి రూ.5 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఓ యువతికి గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, తన పేరుమీద ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందని చెప్పారు. తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదు అని ఆ యువతి సమాధానం ఇచ్చింది. అప్పుడు ఇది ఏదో మోసంలాగా ఉంది అని.. మీరు వెంటనే ఇదే కాల్ ద్వారా సైబర్ క్రైమ్‎ను సంప్రదించడానికి ఫోన్ లో 1 నొక్కండి అని చెప్పారు సైబర్ నేరగాళ్లు. నేరగాళ్ల మాటలు నమ్మిన ఆ యువతి తన ఫొన్‎లో 1 నొక్కగానే ఫోన్ కట్ అయ్యింది. ఈలోపే యువతి ఫోన్‎లో ఏపీకే అనే యాప్ డౌన్లోడ్ అయ్యి,స్కైప్ ద్వారా ఆమెకు వీడియో కాల్ వచ్చింది. ఆ తరువాత ఆమె ఖాతాలోకి రూ.6 లక్షలు వచ్చాయి.

కంగారు పడిన మహిళ వెంటనే, తన భర్తకు సమాచారం ఇచ్చింది. ఆ తరువాత బ్యాంక్‎కు వెళ్లి చూడగా, ఆమె ఖాతా నుండి అప్పటికే 6 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. క్రమంగా లక్ష రూపాయల చొప్పున అకౌంట్లో నగదు తగ్గుతూ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన యువతి 1930కి ఫోన్ చేసి విషయాన్ని తెలుపగా లక్ష 20 వేల రూపాయల ఫ్రీజ్ చేసారు అధికారులు. ఇక ఇలాగే అమీన్‌పూర్ పరిధిలోని ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17 వ తేదీన ట్రేడింగ్‎కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. కాగా అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడిని క్రియేట్ చేసి ఇచ్చారు. ఇలా అతని నగదు ఆన్ లైన్‎లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. అతను పెట్టిన పెట్టుబడికి, లాభాలు చూపిస్తూ వచ్చారు సైబర్ నేరగాళ్లు. కాగా ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా, మూడు లక్షలు లాభాలు చూపించారు. ఇలా పలు దఫాలుగా బాధితుడు మొత్తం రూ.98 లక్షల 40 వేలు ఇన్వెస్ట్ చేశాడు.

తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడిగాడు. అయితే ఎలాంటి స్పందన ఇవ్వలేదు సైబర్ మోసగళ్లు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించాడు. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే బాధితుడు పోగొట్టుకున్న నగదులో లక్ష రూపాయలను హోల్డ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పటాన్ చెరు పారిశ్రామికవాడలో భారీ సైబర్ మోసం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు వాట్సప్ లో పంపిన లింక్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‎మెంట్‎లో కోటి రూపాయలు పోగొట్టుకున్నడు బాధితుడు. 1930 కాల్ ద్వారా రూ.24 లక్షలు ఫ్రీజ్ చేయించారు పోలీసులు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాడు బాధిత వ్యక్తి నాగార్జున. అతనికి నాడియ కామి అనే మహిళ వాట్స్ ఆప్ మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్‎లో ఇన్వెస్ట్‎మెంట్ చేస్తే ఎక్కువ మొత్తంలో సంపాదించొచ్చు అని చెప్పింది. ఆశతో రూ.99,78,526.70 (సుమారు కోటి రూపాయలు ) పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత ఎవరూ స్పందించక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..