Cyber crime: సైబర్ మోసం.. బ్యాంకర్ల పేరిట భారీ చోరీ..వీళ్ల స్కేచ్‌ తెలిస్తే కళ్లు బైర్లే..

|

May 22, 2022 | 9:03 PM

అందివచ్చిన టెక్నాలజీని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాలకు క్యూ కడుతున్నారు. మాట్రిమోని మోసాలు,

Cyber crime: సైబర్ మోసం.. బ్యాంకర్ల పేరిట భారీ చోరీ..వీళ్ల స్కేచ్‌ తెలిస్తే కళ్లు బైర్లే..
Cyber
Follow us on

అందివచ్చిన టెక్నాలజీని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాలకు క్యూ కడుతున్నారు. మాట్రిమోని మోసాలు, పెట్టుబడులు పేరిట, ఇతర వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో సైబ‌ర్ నేర‌గాళ్లు చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా బ్యాంక్‌ సిబ్బంది పేరు చెప్పుకుని లక్షల రూపాయాలు కాజేశారు దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన షేక్ షకీల్ కు బ్యాంక్ అధికారులమ‌ని ఫోన్ కాల్ చేసి 2.48 ల‌క్ష‌లు అకౌంట్ నుంచి కొల్లగొట్టారు. క్రెడిట్ కార్డ్ సీవీవీ నంబర్ ను రద్దు చేస్తామని, సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింద‌ని బాధితుడు తెలిపాడు. దీంతో అత‌ను ఆ నెంబ‌ర్ చెప్ప‌డంతో బాధితుడి మొబైల్ నెంబర్ కు మూడు ఓటీపీ లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే ఈ మోసం చేసిన‌ట్టు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఓటిపికి వచ్చిన 3 మెసేజ్ లను ఫార్వర్డ్ చేయడంతో బాధితుడు భారీ ఎత్తున డబ్బు కోల్పోయాడు. అనంతరం అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 98,999, 99,500, 49,999 నగదును అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. మొత్తం 2,48,498 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు అకౌంట్ నుండి కొట్టేశారు. తాను మోసపోయానని గ్రహించి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో షకీల్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల బారినపడకుండా ఉండాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి