మీర్‌ఆలం ట్యాంక్‌లో ఇటీవల మొసళ్లు,పాములు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసలి ప్రత్యక్షమైంది. పాతబస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం కారణంగా పరిసరాలు పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరస్సు సమీపంలోని రాళ్లపై చిన్న, పెద్ద మొసళ్ల గుంపు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ స్థానిక నివాసితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయంటూ వాపోయారు.
మీర్ ఆలం ట్యాంక్ నెక్లెస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న హస్సానగర్, ఇందిరానగర్, ఫాతిమ్‌నగర్, ఇతర ప్రాంతాలకు ఆనుకుని ఉంటుంది. స్థానిక నివాసితులు బురదతో నిండిన రోడ్లతో అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈ సరస్సు నుండి తమ ఇళ్లలోకి పాములు, తేళ్లు తమ ఇళ్లలోకి వస్తూ.. చిన్న పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) తక్షణమే చర్యలు చేపట్టి సరస్సులోని మొసళ్లను అనువైన ఆవాసాలకు తరలించాలని స్థానికులు కోరారు.
@KTRTRS @HMDA_Gov @HarithaHaram HYDERABAD: The delay in the opening of New Necklaces Road around Mir Alam Tank in the old city has made the surrounding area home to snakes, scorpions, crocodiles and other venomous animals.#wives #likes @nawab_meraj pic.twitter.com/6btOLsl43d
— Abdul.Mukarram (@Mukarram7143) December 12, 2022
పెరుగుతున్న డంప్‌యార్డు, డ్రైనేజీ నీరు నిలిచిపోవడంపై స్థానిక నివాసితుల దుస్థితిపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ప్రారంభించలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి