TS CS: త్వరగా ఆక్సిజన్ రప్పించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు.. ప్రత్యేక బ‌ృందాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం

|

May 07, 2021 | 8:45 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్‌ బెడ్స్ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవసరాలకు సరిపడ ఆక్సిజన్‌ను సమకూర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

TS CS: త్వరగా ఆక్సిజన్ రప్పించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు..  ప్రత్యేక బ‌ృందాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
Cs Somesh Kumar
Follow us on

Telangana CS on Oxygen: తెలంగాణలో ఆక్సిజన్‌, మందుల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్‌ బెడ్స్ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవసరాలకు సరిపడ ఆక్సిజన్‌ను సమకూర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ మేరకు ట్రాన్స్‌పోర్టు, ఆర్‌టీసీ అధికారులతో తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లో శుక్రవారం సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి, తిరిగి వేగంగా తెప్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్‌ ఉన్నాయి. తెలంగాణలో 135 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది. ఎయిర్‌లిఫ్ట్‌ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. ఇదే క్రమంలో అధికారులతో చర్చలు జరిపారు సీఎస్ సోమేశ్ కుమార్. ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్‌ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మెకానిక్‌లు, ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆధికారులను ఆదేశించారు.

ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించుటకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజులకు తగ్గించగలుగుతామని సీఎస్ పేర్కొన్నారు. అవసరమైన మేరకు కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే, నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకువచ్చేందుకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్‌టీసీ డ్రైవర్లు, మెకానిక్‌ బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకునేందుకు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోవాలని సీఎస్ సూచించారు.

Read Also….  CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే.. ‘కోవిన్’ యాప్‌లో సరికొత్త ఫీచర్