Covid-19: కరోనా థర్డ్ వేవ్(Corona Third Wave) ముగిసింది… కానీ పోస్ట్ కోవిడ్ కేసుల డేంజర్ పెరిగింది. అవును… కోవిడ్ తర్వాత… పోస్ట్ కోవిడ్ కేసులు చిక్కులు తెస్తున్నాయి. నిద్రలేమి నుంచి… అలసట వరకు, డయాబెటీస్ నుంచి డిప్రెషన్ వరకు.. కొత్త సమస్యలుగా మారుతున్నాయి. కొందరికి ఇంకో అడుగు ముందుకేసి…. “బ్రెయిన్ ఫాగ్” వంటి డేంజర్ సమస్యలుగా బయటపడుతున్నాయి. కరోనాకు ఇంటిలో ఉండి వైద్యం తీసుకుని కోలుకున్నవారు.. కరోనా తగ్గిన తరవాత ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. హడలెత్తిస్తున్న థర్డ్ వేవ్.. పోస్ట్ కోవిడ్ డేంజరస్ పై వైద్య నిపుణుల సలహాలు సూచనలు.. మార్టిన్. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. కరోనాతో పది పదిహేను రోజులు ఇబ్బంది పడింది. కోలుకుంది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ పోస్ట్ కోవిడ్ పేషంట్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది. ఆయాసం… నీరసం… కనీసం కొన్ని మెట్లు కూడా సరిగ్గా ఎక్కలేని ఇబ్బందులను వచ్చాయంటోంది.
శంకర్. కరోనా వచ్చింది.. తగ్గింది. కానీ …. కరోనా తగ్గిన తరువాత… ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యాయంటున్నాడు. దగ్గు… ఆయాసం…తీవ్రమైన ఫీవర్ ఇలా… చాలారోజులు ఉండి బాధించాయంటున్నారు. కరోనా కంటే… కరోనా తర్వాతే సమస్యులు ఎదురయ్యాయంటున్నాడు. ఇలా చాలా మంది పోస్ట్ కోవిడ్ పేషంట్లు… థర్డ్ వేవ్ లో ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఖచ్చితమైన కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకే ఈసారి ఓమిక్రాన్ కావచ్చు.. డెల్టా కావచ్చు… పాజిటివ్ లో కంటే నెగిటివ్ లోనే బాధపట్టి తీవ్ర సమస్యల వైపు నెట్టెస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ పేషంట్లలో ఒకటా రెండా…. తీవ్ర మైన జ్వరం నుంచి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే వీటిలో కొన్ని ముఖ్యమైన సమస్యలను ఇప్పటికే వైద్యులు గుర్తించారు. కరోనా తగ్గినా… బీ అలర్ట్…. అంటూ హెచ్చిరిస్తున్నారు.
అవును… థర్డ్ వేవ్ అంచనాలకు తగ్గట్టుగానే కొనసాగింది. చాలామంది కరోనాలో ఒమిక్రాన్..డెల్టా వేరియంట్లతో బాధపడ్డారు. కానీ … అత్యధికులు ఇళ్లలోనే చికిత్స పొంది.. బయట పడ్డారు. సీరియస్ గా ఉన్న కేసులే కాదు.. మరణాలు కూడా తక్కువే. చాలా మందికి ఏదో కరోనా వచ్చింది.. పోయింది అన్నట్లు అయింది. చాలా మందికి వారం పది రోజుల్లోనే కరోనా నెగిటివ్ రిపోర్టులు కూడా వచ్చాయి. అంతా సుఖాంతం అనుకున్న సమయంలోనే అసలు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. అనేక మందికి పోస్ట్ కోవిడ్ లో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. అవి ఫస్ట్.. సెకండ్ వేవ్ ల కంటే తీవ్రంగానే వేదిస్తున్నాయి.
ఎస్…. థర్డ్ వేవ్ లో కరోనా తగ్గిన తరువాత… చాలా సమస్యలు బయటపడుతున్నాయి. అందులో దగ్గు, జలుబు తగ్గకపోవడమే కాదు… వాసన, రుచి కూడా కోల్పోయారు. కొందరికి తీవ్ర జ్వరాలు వెంటాడాయి. మరికొందరకి నిద్రలేమి… వత్తిడి… చెస్ట్ పెయిన్ లాంటివి ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకొందరికి డయాబెటీస్ రావడం.. డయాబెటీస్ ఉన్నవారిలో తీవ్రత పెరిగిపోయింది. ఇలాంటి అనేక లక్షణాలు తీవ్రంగా వెంటాడుతున్న కేసులు ఆసుపత్రులకు వస్తున్నాయని డాక్టర్ జాస్తి నందన చెబుతున్నారు.
కేవలం చిన్న చిన్న సమస్యలే కాదు… తీవ్రమైన సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ప్రధానంగా న్యూరాలజీ విభాగంలో వింత కేసులు పోస్టు కోవిడ్ కేసుల్లో బయటపడుతున్నాయి. ఇందులో బ్రెయిన్ ఫాగ్ ఒకటి. ఇంతకీ బ్రెయిన్ ఫాగ్ ఏంటి? ఎలా వస్తోంది? ఏం చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయాందోళలు.. కరోనా ఉక్కిరి బిక్కిరి చేసింది.. భయభ్రాంతులకు గురిచేసింది. సెకండ్ వేవ్.. సైలెంట్ కిల్లర్ లా మారిపోయింది. అనేకమందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు థర్డ్ వేవ్ లో కేసులు అంతగా ఎక్కువ మందిని బాధించలేదు. కానీ కరోనా వచ్చి వెళ్లిన తరువాత అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటున్నారు వైద్యులు. ఇందులో ప్రధానంగా నిద్రలేమిలాంటి సమస్యే కాదు… బ్రెయిన్ ఫాగ్ లాంటి తీవ్ర మైన సమస్యలు బయటపడుతున్నాయని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ చెబుతున్నారు.
Reporter: Ganesh, Hyderabad
Also Read: మొలలుతో ఇబ్బందులు పడుతున్నారా.. ముల్లంగి దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..