Telangana Lift Lockdown: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్.. ఏమాత్రం ఆదమరిస్తే కరోనాకి ఛాన్స్ ఇచ్చినట్లే అంటున్న నిపుణులు!

|

Jun 19, 2021 | 6:50 PM

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయించింది.

Telangana Lift Lockdown: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్.. ఏమాత్రం ఆదమరిస్తే కరోనాకి ఛాన్స్ ఇచ్చినట్లే అంటున్న నిపుణులు!
Telangana Government To Lift Lockdown From June 20
Follow us on

Telangana Lift Lockdown from June 20: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంత్రులందరూ ఒకే చెప్పడంతో ఆంక్షలను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

సెకండ్ వేవ్ కరోనా విజృంభణతో దశలవారీ సడలింపులతో మే12నుంచి అమలుచేసిన లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తేసింది తెలంగాణ సర్కార్. కరోనా కేసుల సంఖ్య తగ్గటంతో వైద్యారోగ్యశాఖనివేదిక ఆధారంగా లాక్‌డౌన్‌ ఎత్తేసింది తెలంగాణ సర్కార్‌. లాక్‌డౌన్‌ ఎత్తేయగానే షట్టర్లన్నీ తెరుచుకుంటున్నాయి. నిబంధనలతో ఇప్పటిదాకా పాక్షికంగానే నడిచిన వ్యాపారసంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రమంత్రి నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ యథాతథంగా పనిచేయబోతున్నాయి. జూలై 1నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు కూడా తెరుచుకోబోతున్నాయి. కరోనా కేసులు తగ్గటంతో స్కూల్స్‌ రీ ఓపెన్‌ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలో విధివిధానాలు విడుదల చేయాలని విద్యాశాఖని ఆదేశిచింది. కొన్ని నెలలుగా ఇళ్లకే పరిమితమైన పిల్లలు వచ్చేనెలనుంచి స్కూల్‌ బాట పట్టబోతున్నారు.

ఇప్పటిదాకా ఆంక్షలతో జనం అప్రమత్తంగా ఉన్నారు. మాస్క్‌లు, భౌతికదూరంతో పాటు వ్యాక్సినేషన్‌తో కరోనాకి కళ్లెం వేయగలిగారు. సామూహికవ్యాప్తికి కారణమయ్యే బార్లు, సినిమాహాళ్లలాంటివి తెరుచుకోకపోవటంతో ఇప్పటిదాకా వైరస్‌ చాలావరకు కంట్రోల్‌లో ఉంది. కానీ, ఆంక్షల ఎత్తివేతతో పరిస్థితి మొదటికొస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

లాక్‌డౌన్‌ ఎత్తివేసినా నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం సూచించింది. అయితే, భౌతికదూరం, మాస్క్‌ల వంటి నిబంధనలున్నా.. వాటిని ఎంతవరకు కచ్చితంగా పాటిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనా మన మధ్యే ఉంది. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో ఇంకా భయపెడుతూనే ఉంది. ఆంక్షలెత్తేశారని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదమంటున్నారు నిపుణులు. సెకండ్‌వేవ్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. ఇప్పుడిప్పుడే జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ టైంలో ఏమాత్రం ఆదమరిచినా కరోనాకి అవకాశమిచ్చినట్లే.

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమని.. అది 6 నుంచి 8 వారాల్లో దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. గులేరియా కామెంట్స్‌ గుబులు రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ మొదలయ్యాక ప్రజల్లో కోవిడ్‌ జాగ్రత్తలు కనిపించడం లేదంటూ బాంబ్ పేల్చారు. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ మధ్య నిర్లక్ష్యమే కొంపముంచింది. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేశారని మళ్లీ రిలాక్స్‌ అయితే మరో ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే.

లాక్‌డౌన్‌ లేదని మళ్లీ పనున్నా లేకపోయినా రోడ్లమీద తిరిగితే.. మాస్క్‌లు మడిచేస్తే..భౌతికదూరం మరిచిపోతే పెనుప్రమాదం తప్పదంటున్నారు. కర్ఫ్యూ ఉంటేనే జాగ్రత్తపడటం, ఆంక్షలుంటేనే అలర్ట్‌గా ఉండటం కాదు..ప్రతీరోజూ ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కరోనా పూర్తిగా కనుమరుగయ్యేదాకా.. స్వీయనియంత్రణ పాటించాల్సిందే.

Read Also… TS Cabinet Meeting Live: తెంగానలో ఆంక్షల్లేవు.. అన్నీ తెరుచుకోబోతున్నాయి.. పార్కులు, పబ్బులు, బార్లు, సినిమాహాళ్లు అన్నీ ఓపెన్‌!