Corona Cases: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 20 మందికి కోవిడ్‌ పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు

Corona Cases: కరోనా కేసులు మళ్లీ మొదలవుతున్నాయి. గత మూడేళ్లుగా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. ఇంకా అక్కడక్కడ..

Corona Cases: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 20 మందికి కోవిడ్‌ పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు
Corona Cases

Updated on: Aug 01, 2022 | 9:55 PM

Corona Cases: కరోనా కేసులు మళ్లీ మొదలవుతున్నాయి. గత మూడేళ్లుగా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. ఇంకా అక్కడక్కడ నమోదవుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హుస్నాబాద్‌లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మొత్తం 20 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

సోమవారం పాఠశాలలో విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వారిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొదట ముగ్గురు విద్యార్థులు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్కూల్‌లో మొత్తం 172 మంది విద్యార్థులు, 39మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉన్నారు. వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో 16 మంది విద్యార్థినులకు, ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు, ఇద్దరు నాన్‌టీచింగ్‌ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ తేలింది. పాఠశాలలలో కరోనా కలకలం సృష్టించడంతో చర్యలు చేపట్టారు అధికారులు. పాశాలలో శానిటేషన్‌ నిర్వహించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మరిన్ని కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి