Telangana: ఆ 15లో కేసీఆర్ కూడా ఉండరు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Telangana: తెలంగాణలో అధికారం చేపబట్టబోయేది బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని,

Telangana: ఆ 15లో కేసీఆర్ కూడా ఉండరు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
Bandi Sanjay
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 9:18 PM

Telangana: తెలంగాణలో అధికారం చేపబట్టబోయేది బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని, ఆ పార్టీకి కేవలం 15 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు సంజయ్. ఆ 15 సీట్లలోనూ కేసీఆర్ ఉండరని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియాతో చిట్‌ చాట్‌లో పాల్గొన్న బండి సంజయ్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్స్ చేశారు. ఇటీవల గజ్వేల్‌లో పోటీ చేస్తానంటూ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ పైనా బండి సంజయ్ స్పందించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కొందరు వాళ్ల వాళ్ల అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నారని, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు సంజయ్. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీజేపీ గెలిస్తే.. దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ నారు. ఎవరు అడ్డుకున్నా పార్టీలో చేరికలు కొనసాగుతాయని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇదే సమయంలో చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై స్పందించారు. చీకోటి ప్రవీణ్ వెనుక మొత్తం టీఆర్ఎస్ నేతలే ఉన్నారని, అందుకే వారంతా సైలెంట్‌గా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..