Covid 19: తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కానీ కాస్త ఊరట..

|

Dec 25, 2023 | 9:18 PM

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు ఊరటనిచ్చే వార్తను తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. జేఎన్ 1 సబ్‌వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్‌ రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించారు. పెరుగుతున్న జ్వరం, జలుబు, దగ్గు కేసులతో...

Covid 19: తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కానీ కాస్త ఊరట..
Corona
Follow us on

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మళ్లీ ప్రభావం చూపిస్తోంది. క్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకీ దేశవ్యాప్తంగా యాక్టీవ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మొత్తం 989 పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా తేలిందిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, కరీంనగర్‌లో ఒక్క కేసు నమోదు అయింది. ఇక కోవిడ్‌ 19 నుంచి 24 గంటల వ్యవధిలో ఒకరు కోలుకోగా, మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు ఊరటనిచ్చే వార్తను తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. జేఎన్ 1 సబ్‌వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్‌ రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించారు. పెరుగుతున్న జ్వరం, జలుబు, దగ్గు కేసులతో జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..