Telangana: ఆవిరైన ఆనందం.. రాజన్న సన్నిధికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. దంపతులు మృతి

|

Sep 03, 2022 | 1:58 PM

కూతురికి అమెరికా వీసా వచ్చిందన్న ఆనందం ఓ వైపు.. ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనే తపన మరో వైపు.. కానీ విధి మాత్రం వారిపై కన్నెర్ర చేసింది. ఎంతో ఆనందంతో బయలుదేరిన ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రోడ్డు..

Telangana: ఆవిరైన ఆనందం.. రాజన్న సన్నిధికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. దంపతులు మృతి
Road Accident
Follow us on

కూతురికి అమెరికా వీసా వచ్చిందన్న ఆనందం ఓ వైపు.. ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనే తపన మరో వైపు.. కానీ విధి మాత్రం వారిపై కన్నెర్ర చేసింది. ఎంతో ఆనందంతో బయలుదేరిన ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇంటిపెద్దలను కబళించింది. ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది. కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మానకొండూరు శివారు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్తున్నంగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన ఇద్దరిని వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్‌గా గుర్తించారు. సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది.

కారులో ఉన్న తమ కూతురు, అల్లుడికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కూతురికి అమెరికా వీసా రావడంతో కుటుంబమంతా కలిసి వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. దంపతుల మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..