Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా1,175 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

|

Jun 22, 2021 | 7:47 PM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా1,175 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..
Telangana Corona
Follow us on

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య6,15,574కి చేరింది. ఇందులో16,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1771 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..ఇప్పటి వరకు మొత్తం 5,95,348 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే 10 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3,586కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,24,907 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,77,70,083కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 70, జీహెచ్ఎంసీ 133, జగిత్యాల 32, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 24, గద్వాల్ 5, కామారెడ్డి 4, కరీంనగర్ 74, ఖమ్మం 76, ఆసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 26, మహబూబాబాద్ 51, మంచిర్యాల 41, మెదక్ 9, మేడ్చల్ 68, ములుగు 28, నాగర్ కర్నూల్ 13, నల్గొండ 70, నారాయణపేట 7, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 64, రాజన్న సిరిసిల్ల 25, రంగారెడ్డి 74, సంగారెడ్డి 17, సిద్ధిపేట 27, సూర్యాపేట 74, వికారాబాద్ 18, వనపర్తి 16, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 41, యదాద్రి భోనగిరిలో 34 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : Defamation Case: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా..

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఒక గంట ఆలస్యం.. మొదలైన ఐదో రోజు ఆట