Coronavirus Cases Telangana: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. ఇందులో 3,234 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,88,577 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 302 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఒక్కరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1590కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 19,821 శాంపిల్స్ పరీక్షించారు.