కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది

| Edited By:

Nov 26, 2020 | 9:25 AM

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 862  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది
Follow us on

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 862  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,444కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 961 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,54,676కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 10,784 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,101 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 52,89,908 కు చేరింది. (చిత్తూరు జిల్లాలో నివర్ ఎఫెక్ట్.. శ్రీకాళహస్తి-కేవీబీపురం మధ్య నిలిచిన రాకపోకలు)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 164, ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 53, జగిత్యాల్‌ 24, జనగాం 4, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 9, కరీంనగర్‌ 38, ఖమ్మం 63, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 8, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 91, ములుగు 11, నాగర్‌ కర్నూల్‌ 10, నల్గొండ 35, నారాయణ్‌పేట్‌ 8, నిర్మల్‌ 2, నిజామాబాద్‌ 13, పెద్దంపల్లి 37, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 57, సంగారెడ్డి 27, సిద్ధిపేట్‌ 20, సూర్యాపేట 28, వికారాబాద్‌ 8, వనపర్తి 11, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 33, యాద్రాది భువనగిరి 10 కేసులు నమోదయ్యాయి. (తీరం దాటిన ‘నివర్’ తుఫాన్‌.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండాలన్న విపత్తుల శాఖ కమిషనర్‌)