తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

|

Mar 26, 2023 | 10:11 AM

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు H3N2 ఫ్లూ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను రెండుసార్లు అప్రమత్తం చేసింది. అయితే తాజాగా తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
Corona Virus
Follow us on

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు H3N2 ఫ్లూ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను రెండుసార్లు అప్రమత్తం చేసింది. అయితే తాజాగా తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 28 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 149 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. ఒకవైపు కరోనా కేసులు మరోవైపు వైరల్ ఫీవర్లు పెరగడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వ్యాక్సి్న్ వేసుకున్న, వేసుకోకపోయిన కరోనా ఎవరిని వదలడం లేదు. కానీ వ్యాక్సిన్ వేసుకుంటే కొంతవరకు రక్షణ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరిగినప్పటికీ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని… దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొంత మంది వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితమే వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు కావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కి లేఖ రాశారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..