Telangana: ట్రాక్ తప్పిన ప్రభుత్వ టీచర్.. మరో సార్‌తో ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆపై

|

Feb 21, 2023 | 1:29 PM

ములుగు జిల్లాలో ఉపాధ్యాయుల రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నాడు భర్త.

Telangana: ట్రాక్ తప్పిన ప్రభుత్వ టీచర్.. మరో సార్‌తో ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆపై
Extra Marital Affair
Follow us on

మేడమ్ గారు గవర్నమెంట్ స్కూల్ టీచర్. పిల్లలకు మంచి విద్యాబుద్దులు చెప్పాల్సిన ఆమే ట్రాక్ తప్పారు. మరో సార్‌తో అఫైర్ పెట్టుకున్నారు. ఆమె భర్త అసలే పోలీస్. ఇలాంటివి సహిస్తాడా..?. ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తిక్క కుదిర్చాడు. ములుగు జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నాడు ఆ టీచర్ హస్బెండ్.  ఈ ఘటన మంగపేట మండల కేంద్రంలో జరిగింది. మంగపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తుంది ఓ వివాహిత. అదే స్కూల్లో పనిచేసే కె. నాగేంద్రబాబు అనే మాస్టారితో ఆమె కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.

ఈ విషయం తెలిసుకున్న ఆమె భర్త రాజు.. భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా ఆమె ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రాలేదు. దీంతో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు భర్త. ఇద్దరినీ ఇంట్లో కట్టేశాడు. ఈ తతంగంపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరి చేతులు తాళ్లతో కట్టేసి గ్రామంలో నడిపించుకంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వివాహిత భర్త ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం