Telangana Congress: కాంగ్రెస్ వార్‌ రూమ్‌ సిబ్బందికి హైకోర్టులో ఊరట.. పోలీసు విచారణపై స్టే..

|

Dec 22, 2022 | 12:11 PM

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌ రూమ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Telangana Congress: కాంగ్రెస్ వార్‌ రూమ్‌ సిబ్బందికి హైకోర్టులో ఊరట.. పోలీసు విచారణపై స్టే..
Sunil Kanugolu
Follow us on

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌ రూమ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నగర పోలీసు సైబర్‌ క్రైమ్‌ విభాగం తనిఖీల అనంతరం కాంగ్రెస్‌ సోషల్ మీడియా వార్‌రూమ్‌ సిబ్బంది మోండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలకు జారీ చేసిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేసింది. కాగా.. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ముగ్గురు వార్ రూప్ సిబ్బందికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతోపాటు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పిటిషర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించగా.. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు.

కాగా, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంలో మోండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. ముగ్గురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేశారు.

అయితే అప్పటినుంచి సునీల్ కనుగోలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తదుపరి చర్యలను నిలిపివేయాలని కాంగ్రెస్ వార్ రూమ్ సిబ్బంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు విచారణపై స్టే విధించింది. కాగా.. దీనిపై రేపు మళ్లీ విచారణ జరగనుంది. కాగా.. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..