Manickam Tagore: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మనిక్కం ఠాగూర్ ఇవాళ సంచలన కామెంట్స్, సవాళ్లు విసిరారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిని చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని ఆయన చెప్పారు. రాజ్యసభలో, తెలంగాణలో ప్రతిపక్ష నేతగా దళితుడైన భట్టిని నియమించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పాని మనిక్కం విమర్శించారు.
దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే ఓర్చుకొని సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను కోనుగోలు చేశారని మనిక్కం ఆరోపించారు. ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ లను వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మనువాదా సిద్ధాంతంను సీఎం కేసీఆర్ పాటిస్తున్నారని, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులకు డిప్యూటీ సీఎం ఇస్తే.. సీఎం కేసీఆర్‌కు ఉన్న ఒక్క మంత్రికి ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష నాయకుడుగా భట్టిని చూడలేకనే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు మనిక్కం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి చోటా దళితులకు సీఎం, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా, తెలంగాణ ప్రతిపక్ష నేతగా దళితులకు ఇచ్చామన్నారు. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే.. మున్సిపల్ శాఖను ఒక దళితునికి ఇవ్వు… నీకు దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే 2023 సీఎం అభ్యర్థిగా దళితుణ్ణి ప్రకటించు అని మనిక్కం సవాల్ విసిరారు.
Read also: Pawan: పవన్ కళ్యాణ్‌కు రాజకీయ చతురత ఏముంది? అతను పరిణితి చెందిన రాజకీయవేత్త కాదు: ఏపీ డిప్యూటీ సీఎం