Warangal Mayor: ఓరుగల్లు మేయర్ పీఠంపై గురి పెట్టిన కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్ దాటేనా..!

| Edited By: Balaraju Goud

Jan 04, 2024 | 7:00 PM

వరంగల్ పశ్చిమ నియజక వర్గానికి చెందిన ఆరుగురు BRS కార్పోరేటర్లు, ఐదుగురు మాజీ కార్పరేటర్లు, పలువురు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో గ్రేటర్ వరంగల్‌లో పట్టు సారిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే GWMC మేయర్ పీఠం దక్కించు కోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

Warangal Mayor: ఓరుగల్లు మేయర్ పీఠంపై గురి పెట్టిన కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్ దాటేనా..!
Greater Warangal Municipal Corporation
Follow us on

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై గురి పెట్టింది. BRS పార్టీ కార్పొరేటర్లకు ఎర వేయడంతో ఒక్కరొక్కరు హస్తం గూటికి ధారపడుతున్నారు. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజవర్గానికి చెందిన ఆరుగురు BRS కార్పొరేటర్లు, పలువురు ముఖ్య నేతలు కారు దిగి కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా ఎంతమంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ లిస్టులో ఉన్నారు..? GWMC మేయర్ పీఠం స్వాధీనం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత..? అవిశ్వాసం సాధ్యమేనా..? ఇదే ఇప్పుడు ఓరుగల్లు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో కుర్చీలు హస్తం వశం అవుతుండగా, రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ మేయర్ సీటుపై మూడు రంగుల జెండాను ఎత్తాలని కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా వరంగల్ పశ్చిమ నియజక వర్గానికి చెందిన ఆరుగురు BRS కార్పోరేటర్లు, ఐదుగురు మాజీ కార్పరేటర్లు, పలువురు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో గ్రేటర్ వరంగల్‌లో పట్టు సారిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే GWMC మేయర్ పీఠం దక్కించు కోవడం కోసం గతవారం రోజులుగా వరంగల్ పశ్చిమ MLA, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి చేస్తున్న మంతనాలు ఫలించాయి. ఆరుగురు BRS కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..

నాయిని రాజేందర్ రెడ్డి ఆపరేషన్ సక్సెస్ అవడంతో వరంగల్ తూర్పు, వర్దన్నపేట లోనూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎనిమిది మంది BRS కార్పొరేటర్లతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రేపో మాపో వారు కూడా కొండా మురళి నేతృత్వం లో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని సమాచారం. ఇక వర్ధన్నపేట నియోజక వర్గం పరిధిలో నలుగురు BRS కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు వారితో మంతనాలు జరుపుకుంటున్నారు. రేపోమాపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కాబోతున్నట్లు సమాచారం..

ఈ క్రమంలోనే అవిశ్వాసం ప్రవేశపెట్టి గ్రేటర్ వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. అయితే GWMCలో ఎవరి బలమేంతా..? బలగమెంతా..? అవిశ్వాసానికి ఆస్కారం ఉందా అనే చర్చ జరుగుతుంది. GWMC లో మొత్తం 66 డివిజన్లు ఉండగా వాటిలో 51స్థానాల్లో BRS, 9 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హనుమకొండ కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 10కి చేరింది. మరో 12 మంది చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 22 కు చేరుతుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టినా నెగ్గే పరిస్థితి లేదు. మెజారిటీ ఫిగర్ ప్రకారం 34 మంది సభ్యుల మద్దతు ఉంటేనే మేయర్ పీఠం దక్కుతుంది. ప్రస్తుతం ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా BRS సభ్యుల సంఖ్య 45 కు చేరింది. ఇప్పుడున్న వారు చేజారిపోకుండా BRS పార్టీ నాయకత్వం, మేయర్, డిప్యూటీ మేయర్ , మాజీ ఎమ్మెల్యేలు వారితో మంతనాలు మొదలు పెట్టారు. బుజ్జగింపులతో ఓదార్చుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు WGMC లో రగిలిన ములసం హాట్ హాట్ చర్చ కు దారితీస్తుంది.. మరి BRS మంతనాలు ఫలిస్తాయా..? లేక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుందో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…