Munugodu Politics: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల సీరియస్ వార్నింగ్.. అలా ఎలా చేస్తారంటూ..

|

Sep 08, 2022 | 7:51 AM

Munugodu Politics: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు గట్టి షాక్ ఇచ్చారు. ఇదేంది రెడ్డీ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Munugodu Politics: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల సీరియస్ వార్నింగ్.. అలా ఎలా చేస్తారంటూ..
Komatireddy Venkat Reddy
Follow us on

Munugodu Politics: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు గట్టి షాక్ ఇచ్చారు. ఇదేంది రెడ్డీ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటావో.. వీడుతావో తేల్చుకోవాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇంతకీ ఆయనపై కేడర్‌‌కు ఎందుకంత ఆగ్రహం? అసలేం జరిగింది? వివరాల్లోకెళ్లి.. మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు టీ కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఈ కామెంట్లు చేశారాయన. కానీ ఆ తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా పర్యటించలేదు. కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలతోనూ సమావేశం కాలేదు. అయినప్పటికీ నేతలు, కేడర్‌ ఎవరూ ప్రశ్నించలేదు.

ఇదిలాఉంటే.. తాజాగా తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ శ్రేణులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని కార్యకర్తలు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రచారం విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తే పర్లేదు కానీ, పార్టీకి వెన్నుపోటు పొడిచేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అంతే కాదు కాంగ్రెస్‌లో ఉంటావో.. బీజేపీలో చేరుతావో తేల్చుకోవాలంటూ అల్టీమేటం జారీ చేశారు.

మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని.. పార్టీలో ఒక వర్గం తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖలు రాయడం పార్టీలో ప్రకంపనలు పుట్టించింది. నేతల భేటీలతో చల్లబడ్డ వెంకట్‌ రెడ్డి ఇప్పుడు రాజగోపాల్‌కి మద్దతివ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. ఈ విషయంలో టీకాంగ్రెస్‌ వెంకట్‌ రెడ్డిని వివరణ కోరుతుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..