Uttam Kumar Reddy: పార్టీ మారడంపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ వీడియోలో ఏం చెప్పారంటే..

టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన, ఆయన భార్య బీఆర్ఎస్‌ గానీ, బీజేపీలోకి గానీ వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ పుకార్లు షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియోను విడుదల చేసిన ఉత్తమ్.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు.

Uttam Kumar Reddy: పార్టీ మారడంపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ వీడియోలో ఏం చెప్పారంటే..
MP Uttam Kumar Reddy(File Photo)

Updated on: Aug 20, 2023 | 11:48 AM

ఎన్నికల సమయం సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. ఆయా పార్టీలు, పార్టీల్లో నేతలపై రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా ఎన్నికొలుస్తున్నాయంటే ప్రధానంగా వినిపించే ప్రచారం.. ఆ నేత పార్టీ మారుతున్నారట.. ఈ నేత ఇందులోంచి అందులోకి జంప్ అవుతున్నారట అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలపై ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సాధారణ నేతలు కూడా కాదు.. బడా బడా నేతలే పార్టీ మారబోతున్నారంటూ విపరీతమైన గాసిప్స్ రన్ అవుతున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో.

తాజాగా టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన, ఆయన భార్య బీఆర్ఎస్‌ గానీ, బీజేపీలోకి గానీ వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ పుకార్లు షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియోను విడుదల చేసిన ఉత్తమ్.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీలో ఉంటామని స్పష్టమైన ప్రకటన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు ఉత్తమ్.

టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధిగా రేవంత్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ అధ్యక్షుడిగా వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ నియామకాన్ని పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు పార్టీని వీడగా.. మరికొందరు వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే, పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి అందరికీ సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతా సెట్ అయ్యిందని అనుకున్నారు. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలైనట్లు పరిస్థితులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది.. కాంగ్రెస్‌లోని సీనియర్ లీడర్లే టార్గెట్‌గా పార్టీ మారుతారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మొన్నటి మొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక చాలురా బాబూ అంటూ జగ్గారెడ్డే స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, కొంచెం ఘాటు పెంచి.. మరోసారి ఇలా చేస్తే నా గేమ్ మొదలు పెడతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇలా ఉందన్నమాట కాంగ్రెస్‌లో పరిస్థితి.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ చీఫ్ ఖర్గేతో టీపీసీసీ నేతల భేటీ..

మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో టీపీసీసీ నేతలు భేటీ కానున్నారు. ఢిల్లీలో జరుగనున్న ఈ భేటీలో చేవెళ్ల సభతో పాటు, పలు అంశాలపై చర్చించనున్నారు. కొత్తగా పార్టీలో చేరికలపై కూడా చర్చించనున్నారు నేతలు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్టరేషన్ విడుదల చేయనుంది కాంగ్రెస్. మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు టీపీసీసీ నేతలు. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను విడుదల చేసిన టీపీసీసీ.. ఇప్పుడు మరికొన్ని డిక్లరేషన్స్‌పై దృష్టి సారించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..