Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ

|

Mar 23, 2021 | 3:15 PM

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Revanth-Reddy
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 తెలంగాణలో కొత్తగా 412 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 412 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కాగా సోమవారం వైరస్ కారణంగా  ముగ్గురు మృతి చెందినట్లు  వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1674కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉన్నాయి. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు వెలుగుచూశాయి.

దేశంలో కొత్తగా 40,715 కరోనా కేసులు:

దేశంలో కరోనా తీవ్రత ప్రమాదరకంగా ఉంది. కొత్తగా 40,715 మందికి వైరస్ పాజిటివ్ అని తేలగా..199 మంది ప్రాణాలు విడిచారు. దాంతో ఇప్పటివరకు 1,16,86,796 మంది కరోనా బారిన పడగా.. మరణాలు 1.6లక్షల మార్కును దాటినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.

Also Read: Hyderabad Crime News: తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త.. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..?

AP Crime News: కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన మామ దారి తప్పాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో