వారంతా పార్టీలో చేరుతున్నారు.. మరి ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

|

Feb 26, 2024 | 5:39 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. అదే జోష్‌తో పార్లమెంట్‌ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు ఆశావహుల నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల మధ్య ఎంపీ టిక్కెట్ల పంచాయితీ ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల.. సీనియర్‌ నాయకులు పార్లమెంటు సీట్లపై కర్చీఫ్‌ వేసుకున్నట్టు తెలుస్తోంది.

వారంతా పార్టీలో చేరుతున్నారు.. మరి ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..
V Hanumantha Rao
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. అదే జోష్‌తో పార్లమెంట్‌ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు ఆశావహుల నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల మధ్య ఎంపీ టిక్కెట్ల పంచాయితీ ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల.. సీనియర్‌ నాయకులు పార్లమెంటు సీట్లపై కర్చీఫ్‌ వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీని, హైకమాండ్‌ను డిమాండ్‌ చేస్తున్నారు సీనియర్‌ నేత వీ.హనుమంతరావు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో అవకాశమిస్తే మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. బీసీలు ఇంకెన్నాళ్లిలా ఓట్లువేసే మెషీన్‌ల మాదిరి ఉండాలని ప్రశ్నించారు వీహెచ్‌. గెలిచింది కాబట్టి ఇప్పుడంతా కాంగ్రెస్‌లో వచ్చిచేరుతున్నారనీ.. వాళ్లకు అవకాశమిస్తే ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ వీహెచ్‌ ప్రశ్నించారు.

జనార్ధన్‌రెడ్డి నుంచి రాజశేఖర్‌రెడ్డి దాకా.. ఎంతో మంది నాయకులను తయారు చేశాననీ.. ఇప్పుడు తనకే గుర్తింపు లేకుండా పోయిందని వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఈసారి ఎంపీసీటు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

వీడియో చూడండి..

ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కరోజే హ్యాపీగా ఉండేవాడిని: జగ్గారెడ్డి..

వీహెచ్‌ ఇలా ఉంటే.. మరో సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి మాత్రం మరోలా రెస్పాండయ్యారు. మెదక్‌ ఎంపీ సీటు దక్కించుకునేందుకు హడావుడి చేస్తున్నారంటూ, తనపై కమలంనేతలు చేసిన ఆరోపణల్ని ఖండించారు జగ్గారెడ్డి. ఇప్పుడున్న బీజేపీ నేతలు.. తనముందు బచ్చాగాళ్లంటూ తీసిపారేశారు. తనకు కావాలంటే డైరెక్టుగానే ఎంపీ సీటు అడుగుతానని చెప్పారు జగ్గారెడ్డి. అసలు తనకా ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కరోజే హ్యాపీగా ఉండేవాడినన్న జగ్గారెడ్డి… తాను ఓడినా ఇప్పుడు కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వచ్చినందుకు రోజూ హ్యాపీగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..