రెండో రోజు కొనసాగుతున్న భట్టి దీక్ష

| Edited By:

Jun 09, 2019 | 12:11 PM

టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆయన నిన్నటి నుంచి దీక్షకు కూర్చున్నారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన ఈ దీక్ష తొలుత 36 గంటలపాటు చేయాలని భావించారు. అయితే భట్టి నిరవధిక నిరసన దీక్షకు దిగుతున్నట్లు టీపీసీసీ చీఫ్ […]

రెండో రోజు కొనసాగుతున్న భట్టి దీక్ష
Follow us on

టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆయన నిన్నటి నుంచి దీక్షకు కూర్చున్నారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు సంఘీభావం తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన ఈ దీక్ష తొలుత 36 గంటలపాటు చేయాలని భావించారు. అయితే భట్టి నిరవధిక నిరసన దీక్షకు దిగుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గమని ప్రకటించారు. దీక్షలో కూర్చున్న భట్టికి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేశారు. భట్టీకి మద్దతు తెలుపుతూ ధర్నాచౌక్ దగ్గర ఆయన సోదరుడు మల్లు రవి, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అటు ఆదివారం మాజీ ఎంపీ వీహెచ్, మరి కొందరు నేతలు కూడా భట్టికి సంఘీభావం తెలుపుతూ.. దీక్షలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. అలా చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇతర పార్టీల సభ్యులను విలీనం చేసే అధికారం స్పీకర్‌కు ఉండదని చెప్పారు.