ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. సభావేదికగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణిని రైతులు వ్యతిరేస్తున్నారని వ్యాఖ్యనించారు. ధరణికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడటానికి తామంతా సిద్దంగా ఉన్నామని తెలిపారు. పీపుల్స్ మార్చ్ యాత్రను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించాని.. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. రాష్ట్ర సందను సీఎం కేసీఆర్ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది కేవలం మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదన్నారు. అలాగే తాను చేపట్టిన పీపుల్స్ మార్చ యాత్ర కూడా భట్టి పాదయాత్ర కాదని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని పేర్కొన్నారు.
ఈ యాత్రలో భాగంగా అనేక చోట్లు తిరిగానని.. తెలంగాణ వస్తే ప్రజలు తమ భూములు తమకు వస్తాయని అనుకున్నారని.. కానీ అధికార నేతలు పోడు భూములు లాక్కోడానికి ప్రయత్నించారని విమర్శించారు. పాదయత్రలో తమను ప్రజలు ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారని తెలిపారు. ఇదిలా ఉండగా జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హజరయ్యారు. సభావేదికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పొంగలేటి ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..