Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థులకు హైకమాండ్ అలర్ట్.. తెలంగాణకు రానున్న ఏఐసీసీ అగ్ర నేతలు.. కారణం అదేనా

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ జరగుతుందని.. హంగ్ వచ్చే అవకాశముందని కొన్ని సర్వేలు చెప్పగా.. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ దే పై చేయి ఉంటుందని ప్రకటించాయి.

Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థులకు హైకమాండ్ అలర్ట్.. తెలంగాణకు రానున్న ఏఐసీసీ అగ్ర నేతలు.. కారణం అదేనా
Congress Party

Updated on: Dec 02, 2023 | 1:12 PM

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ జరగుతుందని.. హంగ్ వచ్చే అవకాశముందని కొన్ని సర్వేలు చెప్పగా.. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ దే పై చేయి ఉంటుందని ప్రకటించాయి. అయితే, కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహగానాల మధ్య కాంగ్రెస్ హై కమాండ్ అప్రమత్తం అయింది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపిస్తోంది. సాయంత్రం వరకు డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పలు సూచనలు చేసింది.. గెలిచిన అభ్యర్థులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు రావాలని ఆదేశించింది.

అంతేకాకుండా.. తెలంగాణకు ఏఐసీసీ పెద్దలను కూడా రంగంలోకి దింపింది హైకమాండ్.. రేపు ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలాకు టీకాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. రేపు ఉదయాన్నే చిదంబరం, షిండే, సూర్జేవాలా హైదరాబాద్‌కు రానున్నారు.

ఏఐసీసీ పెద్దలు ఎన్నికల ఫలితాలపై పరిశీలన జరపడంతోపాటు గెలిచిన అభ్యర్థులకు పలు సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్ వచ్చిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

తెలంగాణ పోలింగ్ ఫలితాల కవరేజ్ కోసం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.