తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది..రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. సంక్రాంతికి ముందు చలి ఎక్కువగా ఉంటుందనే మాటలకు అద్దం పట్టేలా చలి తీవ్రత అధికంగా మారింది. ముఖ్యంగా చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా నేడు తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గరిష్టంగా మహబూబ్ నగర్ లో 17.1 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇకపోతే, భద్రాచలం..16.5 c, ఖమ్మం..16 c, నల్లగొండ..16 c, హయత్ నగర్..14 c, హైదరాబాద్..13.6 c, నిజామాబాద్..13.4 c, హకీమ్ పెట్..13.3 c,
దుండిగల్..12.4 c, హనుమకొండ..11.5 c, మెదక్..11.3 c, రామగుండం..10.6 c, రాజేంద్ర నగర్..10.5 c, పఠాన్ చెరువు..9.6 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
ఇదిలా ఉంటే పెరుగుతున్న చలి తీవ్రతతో పాటుగా, కొత్తగా వచ్చిన HMPV వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వయస్సు మీదపడిన వారు, శ్వాస సంబందిత వ్యాదులతో బాదపడుతున్న వారు బయటకు రాకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..