CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!

|

Mar 17, 2024 | 4:34 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విమానం టేకాప్ అయ్యాక ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నర పాటు ఫైట్‌లోనే!
Cm Revanth Reddy
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విమానం టేకాప్ అయ్యాక ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కకుపోయారు.

మధ్యాహ్నం 2.30గంటకు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలట్. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నికల్ టీమ్ ఇంజిన్ ఐసీయులో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఇంజన్ వేడెక్కడంతో ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో గంట నుంచి రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి విమానంలోనే ఉండిపోయారు. రిపేర్ అనంతరం మళ్లీ టేకప్ అయిన విమానం ముంబైకి వెళ్ళిపోయింది.

ముంబైలో జరిగే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు, భట్టి, పొన్నం, దీపాదాస్‌ మున్షి పలువురు ముఖ్యనేతలు ఇండిగో విమానంలో బయలుదేరారు. ఈ విమానంలో మొదటి రో లో A2 సీటులో సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్‌ బుక్‌ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టెక్నికల్ సమస్య కారణంగా గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనంతరం సాంకేతిక సమస్యలను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…