Revanth Reddy: ఇకనుంచి భూమాత..! ధరణి, రైతుబంధుపై రేవంత్ ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయ్..

|

Feb 24, 2024 | 11:33 AM

తెలంగాణ ప్రజలకు ధరణి సమస్యల నుంచి మోక్షం కలిగేనా..? ధరణి పేరు మార్పు పై సీఎం రివ్యూలో డెసిషన్ తీసుకుంటారా? ధరణి, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఫుల్‌ డే ధరణిపై మంత్రులు, ధరణి కమిటీ, ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేస్తారు.

Revanth Reddy: ఇకనుంచి భూమాత..! ధరణి, రైతుబంధుపై రేవంత్ ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయ్..
Revanth Reddy
Follow us on

తెలంగాణ ప్రజలకు ధరణి సమస్యల నుంచి మోక్షం కలిగేనా..? ధరణి పేరు మార్పు పై సీఎం రివ్యూలో డెసిషన్ తీసుకుంటారా? ధరణి, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఫుల్‌ డే ధరణిపై మంత్రులు, ధరణి కమిటీ, ఉన్నతాధికారులతో కలిసి అధ్యయం చేస్తారు. ముందుగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ధరణికి భూమాతగా పేరు మార్పుతో పాటు సైట్‌ ను సరళీకరించడంపై చర్చిస్తారు. అభ్యంతరాల నివృత్తికి మార్గాలను కలెక్టర్లతో చర్చిస్తారు సీఎం. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశం చాలా ఆసక్తికరంగా మార‌నుంది. , రైతు బంధుతో పాటు ధరణి పేరు మార్పు.. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఎలా అడుగులు వేయబడుతుందనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే ధరణి సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. యాక్షన్‌ లోకి దిగిన ధరణి కమిటీ ఐదు జిల్లాల కలెక్టర్లు, దేవదాయ శాఖ, అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం అయింది ధరణి కమిటీ. ధరణి వచ్చాక నేరుగా ప్రజలు, రైతుల పడుతున్న ఇబ్బందులను గుర్తించింది కమిటీ. భూ సమస్యలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంది. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలని దానిపై నివేదికను సిద్ధం చేసింది కమిటీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈరిపోర్ట్ ను ముందుంచనుంది. ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. అయితే ధరణి వెబ్ సైట్ ని ఒక ప్రైవేటు కంపెనీకి అప్ప చెప్పకుండా సీసీఎల్ఏ వద్ద భద్రంగా ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.. ఇప్పటికే ప్రైవేటు కంపెనీకి అప్ప చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే భూములు ఉన్నాయో ఆ వివరాలన్నీ ప్రైవేటు వారికి అప్పజెప్పార‌నే బావ‌న‌లో తెలంగాణ ప్రజలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తుంది.

రైతు బంధు నిబంధనలపై సీఎం సమీక్ష

అలాగే గత ప్రభుత్వంలో జ‌రిగిన రైతు బంధు అవ‌క‌త‌వ‌క‌లతో పాటు, వృధాగా ఇచ్చిన రైతు బంధు పై కూడ లెక్కలు తీయాల‌ని అధికార‌లను ఆదేశించారు సిఎం రేవంత్. గ‌త ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం.. రైతుబంధు నిబంధనలపై సమీక్ష చేయనుంది. కొత్తగా అమలు చేయబోయే రైతు భరోసా పథకం కింద కేవలం సాగు భూములు, నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కోట్లాది ఆస్తులున్నోళ్లకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తుంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేలు ప్రభుత్వం అందజేయనుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. పంటల సాగును గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందజేయడానికి గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా పథకం అమల్లోకి రానుంది. దీనిపై ఈ స‌మీక్షలో చ‌ర్చించ‌నున్నారు.

మొత్తంగా ఇవాళ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగే రివ్యూలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ధరణి, రైతు బంధు అంశాల‌ను ప్రక్షాళ‌న చేయాల‌ని భావిస్తున్న సిఎం రేవంత్.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..