AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు 2028 డిసెంబర్‌లో జరగవని.. 2029 జూన్‌లోనే శాసన సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అలాగే మళ్లీ రెండో సారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టే అధికారంలోకి వస్తుందని, ప్రజా పాలనే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
Cm Revanth Reddy Sensational Comments
Anand T
|

Updated on: Jul 10, 2026 | 6:55 PM

Share

తెలంగాణలో రాబోయే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు 2028 డిసెంబర్‌లో జరగవని.. శాసనసభ ఎన్నికలు జరిగేది 2029 మే, జూన్ నెలలోనేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు చేరుతాయని, అలాగే 17గా ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య 25కు చేరుతుందని చెప్పుకొచ్చారు.

సీట్లు పెరిగిన తర్వాత జరిగే ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి.. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ఆ భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెబుతున్నా.. ఇది రాసిపెట్టుకోండి.. ఈ రోజు చెప్పింది జరిగి తీరుతుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

అలాగే అటు ప్రతిపక్ష పార్టీలపై కూడా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామని.. పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించామన్నారు. త్వరలో జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది తామేనని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా స్పష్టం చేశారు.

సీఎం స్పీచ్‌కు సంబంధించిన వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు
రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు
గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!
గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!
ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో
ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో
అఖిల్ 'లెనిన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
అఖిల్ 'లెనిన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఇంట్లో పరీక్ష రాస్తే 96% మార్కులు.. క్లాస్‌రూమ్‌లో 48% మార్కులు..
ఇంట్లో పరీక్ష రాస్తే 96% మార్కులు.. క్లాస్‌రూమ్‌లో 48% మార్కులు..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్..
పాతకాలపు పద్ధతిలో గుత్తి వంకాయ కూర
పాతకాలపు పద్ధతిలో గుత్తి వంకాయ కూర
SIR పేరుతో మోసాలకు జాగ్రత్త.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు
SIR పేరుతో మోసాలకు జాగ్రత్త.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు