Telangana: తెలంగాణ EAPCET ఫలితాలు వచ్చేశాయ్.. రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కే నేరుగా..

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కే నేరుగా ఫలితాలు వెళ్తాయ్‌. ర్యాంకులతో పాటు మార్కులు విడుదల చేశారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..

Telangana: తెలంగాణ EAPCET ఫలితాలు వచ్చేశాయ్.. రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కే నేరుగా..
TS EAPCET 2025 Results

Updated on: May 11, 2025 | 12:21 PM

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కే నేరుగా ఫలితాలు వెళ్తాయ్‌. ర్యాంకులతో పాటు మార్కులు విడుదల చేశారు సీఎం రేవంత్. పరీక్షలు జరిగిన వారం రోజుల్లోనే ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్‌ 29 నుంచి మే 4వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పరీక్ష రాసిన 2లక్షల 7వేల మంది రాయగా.. అగ్రి, ఫార్మా విభాగాల్లో పరీక్ష రాసిన 81వేల మంది విద్యార్థులు రాశారు. ఇక త్వరలోనే కౌన్సిలింగ్‌ తేదీలు వెల్లడించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంజినీరింగ్‌లో టాపర్‌గా ఏపీకి చెందిన భరత్‌చంద్ర, అగ్రి, ఫార్మా టాపర్‌గా మేడ్చల్‌కు చెందిన సాకేత్‌ నిలిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి