Runa Mafi App: రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి యాప్.. ఎలా అప్లై చేయాలంటే..?

|

Aug 27, 2024 | 5:43 PM

పలు సమస్యలతో రుణమాఫీ కాని రైతులపై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రైతు భరోసా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Runa Mafi App:  రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి యాప్.. ఎలా అప్లై చేయాలంటే..?
Rythu Bharosa
Follow us on

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇప్పటివరకు రూ. 31 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవటం వంటి కారణాలతో వారి రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పలు సమస్యలతో రుణమాఫీ కాని రైతులపై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రైతు భరోసా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే యాప్‌ ట్రయల్ పూర్తి కాగా, మంగళవారం(ఆగస్ట్27) సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ​అంతేకాదు యాప్‌ వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

రాష్ర్ట సర్కార్ 2 లక్షలలోపు లోన్లు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు పంద్రాగస్టులోపు 2 లక్షలలోపు లోన్లు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసింది. కానీ కొన్ని టెక్నికల్ ​సమస్యల వల్ల చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. రకరకాల ఇబ్బందుల వల్ల చాలా మందికి లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు గుర్తించి, ఆ రిపోర్టును ఇటీవల రాష్ర్ట సర్కారుకు అందించారు. దీంతో రైతు సమస్యల పరిష్కరించేందుకు రాష్ర్ట సర్కారు రైతు భరోసా యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల వివరాలను ఈయాప్‌లో నమోదు చేయనున్నారు. అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు వెళ్లి వివరాలను సేకరిస్తారు.

‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది రాష్ట్ర సర్కార్. అర్హులై ఉండి, రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచి అంటే ఆగస్టు 27 నుంచే ఈ సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.