KCR Nirmal Tour: నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్, పార్టీ ఆఫీస్ ప్రారంభం .. ఆపై బహిరంగ సభలో ప్రసంగం..

CM KCR Nirmal Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా వస్తున్న కేసీఆర్ కోసం కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు..

KCR Nirmal Tour: నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్, పార్టీ ఆఫీస్ ప్రారంభం .. ఆపై బహిరంగ సభలో ప్రసంగం..
CM KCR Nirmal Tour

Updated on: Jun 04, 2023 | 9:24 AM

CM KCR Nirmal Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా వస్తున్న కేసీఆర్ కోసం కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశారు జిల్లా నాయకులు. సాయంత్రం 4 గంటలకు నిర్మల్ చేరుకోనున్న కేసీఆర్ తన పర్యటనలో భాగంగా.. నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

అనంతరం కొండాపూర్‌ వద్ద నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇవే కాక డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేయడంతో సహా మరో 6 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి మరీ సీఎం పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..