సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!

|

Jul 04, 2021 | 8:25 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆదివారం బిజీ.. బిజీగా గడిపారు. అనుకున్న సమయానికే..

సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!
Kcr Sircilla Tour
Follow us on

Sampath Kumar Gandla, Tv9 Reporter

KCR Sircilla tour : ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆదివారం బిజీ.. బిజీగా గడిపారు. అనుకున్న సమయానికే సిరిసిల్లలో సీఎం పర్యటన కొనసాగింది. రూ.210 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం కేసీఆర్.. ఆయన వెంట మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో… డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అయితే, రిబ్బన్ కట్ చేసే సమయంలో కత్తెర లేకపోవడంతో కేసీఆర్ అసహనానికి గురయ్యారు.. చేయితో రిబ్బన్ ని తీసేశారు. అక్కడున్న అధికారులు సైలెంట్ అయ్యారు.

ఇంటర్నేషనల్ డ్రెస్సింగ్ స్కూల్, నర్సింగ్ కళాశాల, మార్కెట్ యార్డు, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎప్పటిలాగానే తన ప్రసంగంలో నవ్వులు పుట్టించారు. ఓ వైపు అభివృద్ధి గురించి చెబుతునే చలోక్తులు విసిరారు. అంతకు. ముందు కేటీఆర్ మాట్లాడిన అంశాలను ప్రస్తవించారు. రామారావు అడిగినవన్నీ ఇస్తా.. మెడికల్ కళాశాల మాత్రం మరో రౌండ్ లో ఇస్తానని చెప్పారు. ఇక సిరిసిల్ల పర్యాటక సిరిసిల్లగా మారుతుందని వరాల జల్లు కురిపించారు సీఎం. అటు మిడ్ మానేరు.. ఇటు అప్పర్ మానేరులను పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయని కేసీఆర్ చెప్పారు.

ఇక వేములవాడ రాజన్న ఆలయం గొప్పగా అభివృద్ధి చెందుతుంది.. రాజన్న దేవుడు దయతోనే… ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు సీఎం కేసీఆర్. దాదాపు.. 55 నిమిషాలు ప్రసంగించారు. ఎక్కడా రాజకీయాల జోలికిపోకుండా అభివృద్ధి గురించి మాట్లాడారు.. కరోనా ను మాత్రం వదిలి పెట్టలేదు. కరోనా మన జీవితాలను నాశనం చేస్తుందన్నారు. జాగ్రత్త ఒక్కటే మార్గమని చెప్పారు. సర్పంచ్ లకు క్లాస్ పీకారు. పల్లె ప్రగతి విజయవంతం చేయాలని కోరారు. హరితహారంతో సగం రోగాలు పోతాయి. ఇప్పుడు ఆక్సిజన్ కొనుగోలు చేసే పరిస్థితి ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనని కాపాడుతుందన్నారు కేసీఆర్. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల గులాబీ మయంగా మారింది. ఎటు చూసిన భారీ కటౌంట్లు ఏర్పాటు చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు.

Read also :  ‘దర్బంగ’ కేసులో సంచలనాలు: హైదరాబాద్ కేంద్రంగా ఎన్.ఐ.ఎ విచారణ, కదులుతోన్న ఉగ్రడొంక