Telangana: తెలంగాణలో అదే పరిస్థితి ఉంది.. చంద్రబాబు చెప్పిందే నిజమన్న సీఎం కేసీఆర్..

|

Jun 22, 2023 | 4:37 PM

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్‌) గుర్తు చేశారు. మంచి ప్రభుత్వం ఉంటే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు..

Telangana: తెలంగాణలో అదే పరిస్థితి ఉంది.. చంద్రబాబు చెప్పిందే నిజమన్న సీఎం కేసీఆర్..
CM KCR on Chandrababu
Follow us on

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో భూముల ధరలపై మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్‌) గుర్తు చేశారు. మంచి ప్రభుత్వం ఉంటే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు కొంటున్నారని చంద్రబాబు చెప్పిన మాటలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడకూడదు అని కోరుకున్న మన శత్రువులు చంద్రబాబు నాయుడే స్వయంగా ఇప్పుడు చెప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. అంతే పటాన్ చెరువు ప్రాంతంలో ఎకరా భూమి అమ్మితే రూ. 30 కోట్లు వస్తున్నాయని.. చంద్రబాబు అన్న మాట నిజమే అని అన్నారు.

విషయం తారుమారు అయ్యిందని అన్నారు సీఎం కేసీఆర్. మంచి నాయకత్వం ఉంటే.. మంచి ప్రభుత్వం ఉంటే.. తెలంగాణలో భూములు ఎట్ల పెరిగినాయో మనం చూస్తున్నామని.. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతయని అన్నారు. అయితే ఇప్పుడు పటాన్ చెరువు ప్రాంతంలో ఎకరాకా ఎకరం భూమిని అమ్మితే వచ్చే రూ. 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో 100 ఎకరాలు కొనవచ్చని.. చంద్రబాబు చెప్పినదాని నిజం ఉందన్నారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ భూములపై టీడీపీ అధినేత చంద్రబాబు చేప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఏలో ఒకప్పుడు భూముల విలువ చాలా ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం అలా లేదన్నారు. తెలంగాణలో ఒక ఎవరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 50 ఎకరాలు కొనే పరిస్థితి ఉందన్నారు. ఏపీలో భూముల ధర తగ్గిందని, రిజిస్ట్రేషన్ విలువ పెరిగిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం