
CM KCR – BRS Public Meeting: ఎన్నికల సంగ్రామంలో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ కారు గుర్తుకు ఓటేసి.. హ్యాట్రిక్ విజయాన్ని అందించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్.. మూడోసారి కొత్తగూడెం, ఖమ్మం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తరుఫున మాట్లాడనున్నారు. అనంతరం ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రాంగణంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..