CM KCR: మీరు దీవిస్తే ఈ గడ్డ నుంచే జాతీయ రాజకీయాల్లోకి.. నిజామాబాద్​ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్..

|

Sep 05, 2022 | 5:49 PM

అజెండా కూడా ఫిక్స్ చేస్తున్న కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ హామీని సైతం పబ్లిక్‌గా ప్రకటించారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. 

CM KCR: మీరు దీవిస్తే ఈ గడ్డ నుంచే జాతీయ రాజకీయాల్లోకి.. నిజామాబాద్​ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

ఇంతకాలం జాతీయరాజకీయాలపై హింట్స్ మాత్రమే ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. ముక్త్‌ బీజేపీ నినాదంతో జాతీయరాజకీయాల్లో వెళతామని స్పష్టం చేశారు. నిజామాబాద్​ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ముందుగా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఆ తరువాత గిరిరాజ్ కళాశాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. అజెండా కూడా ఫిక్స్ చేస్తున్న కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ హామీని సైతం పబ్లిక్‌గా ప్రకటించారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమాగా బలంగా చెబుతున్నారు సీఎం కేసీఆర్‌.

ఈ సందర్భంగా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోదీ చెప్తున్నారని అన్నారు సీఎం కేసీఆర్. బావి కాడ మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలని పిలుపునిచ్చారు. 2024లో బీజేపీ ముక్త్‌ భారత్‌ ఉండాలని సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు.

దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలన్న ఆయన.. తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు. ఈ 8 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా..? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం