Srinivas Goud: కుల‌వృత్తుల వారు ఆత్మగౌర‌వంతో బ‌తికాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయంః మంత్రి శ్రీనివాస్ గౌడ్

|

Jul 08, 2021 | 8:51 PM

హైదరాబాద్ ర‌వీంద్రభార‌తిలో కేసీఆర్ అభ‌య హ‌స్తం ప‌థ‌కం కింద క‌ల్లుగీత వృత్తిలో భాగంగా ప్రమాదానికి గురైన వారికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు.

Srinivas Goud: కుల‌వృత్తుల వారు ఆత్మగౌర‌వంతో బ‌తికాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయంః మంత్రి శ్రీనివాస్ గౌడ్
Exgratia Distribution To Toddy Tappers
Follow us on

Minister Srinivas Goud Exgratia distribution to Toddy Tappers: హైదరాబాద్ ర‌వీంద్రభార‌తిలో కేసీఆర్ అభ‌య హ‌స్తం ప‌థ‌కం కింద క‌ల్లుగీత వృత్తిలో భాగంగా ప్రమాదానికి గురైన వారికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు. చెట్టు నుంచి జారిపడి మ‌ర‌ణించిన 126 మంది క‌ల్లుగీత కార్మికుల‌కు రూ. 5 ల‌క్షల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి రూ. 5 ల‌క్షల చొప్పున, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన 315 మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం 588 మంది క‌ల్లుగీత కార్మికుల కుటుంబాల‌కు రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. క‌ల్లుగీత వృత్తిదారుల‌ను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని స్పష్టం చేశారు. హ‌రిత‌హారంలో భాగంగా ల‌క్షల సంఖ్యలో ఈత‌, తాటి మొక్కల‌ను నాటామ‌ని గుర్తు చేశారు. గౌడ వృత్తిదారుల భ‌వ‌నం కోసం కోకాపేట్‌లో రూ. 300 కోట్ల విలువైన స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. ఆ భ‌వ‌న నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింద‌న్నారు. నీరా పాల‌సీని తీసుకొచ్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కుల‌వృత్తుల వారు ఆత్మగౌర‌వంతో బ‌తికేలా సీఎం కేసీఆర్ ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.

ట్యాంక్‌బండ్‌పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రక‌టించారు. త్వర‌లో గౌడ సోద‌రుల‌కు డిజైన్‌తో కూడిన లూనాలు అందిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also… KRMB Meeting: రెండు రాష్ట్రాల మధ్య జటిలమవుతున్న జలవివాదం.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా