ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం

|

Apr 08, 2021 | 8:09 PM

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి...

ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం
Cm Kcr
Follow us on

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.

కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. మిగతా వర్గాలకు ప్రభుత్వాల నుంచి ఎంతో కొంత.. చేయూత లభించినా.. వీరికి మాత్రం ఆకలి బాధలు ఎదురయ్యాయి. కొన్ని ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అయితే కనీసం వారికి అందుబాటులోకి రాకుండా పోయాయి. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. కొందరు అయితే ఆత్మహత్యల దిశగా వెళ్లిన ఘటనలు కూడా చూశాం. ఈ పరిస్థితలను గమనించిన సీఎం కేసీఆర్ వారికి ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు బియ్యాన్ని సాయంగా ఇవ్వాలని నిర్ణయించారు.

Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు

యజమానిపై పులి ఆకస్మిక దాడి.. కొమ్ములతో ఎగబడ్డ గేదెలు.. లగెత్తిన టైగర్..