Telangana Govt Lifts Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత‌.. కీల‌క ఆదేశాలు జారీ చేసిన కేబినెట్

|

Jun 19, 2021 | 3:53 PM

Telangana Unlock: లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ‌ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం...

Telangana Govt Lifts Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత‌.. కీల‌క ఆదేశాలు జారీ చేసిన కేబినెట్
Cm Kcr
Follow us on

Telangana Lockdown Removed: లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ‌ కేబినెట్ నిర్ణయించింది. కొవిడ్​ ఉద్ధృతి తగ్గడంతో లాక్​డౌన్​ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో పాటు కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగించాలని అధికారుల‌కు సూచించింది.

దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారుందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు…జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా … అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

Also Read: రూ.10 ల‌క్ష‌ల‌కే కేజీ బంగారం, త్వరపడ్డారో.. బిస్కెట్టే !

సైబర్ నేరగాళ్లకు వరంలా మారిన లాక్‌డౌన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.. ఒకరు కాదు ఇద్దరు కాదు 54 మందికి టోకరా!