AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cm Kcr Adopted Daughter: పెళ్లి కూతురుగా ముస్తాబయిన సీఎం కేసీఆర్ దత్తపుత్రిక.. పట్టు బట్టలు, గోల్డ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించిన సీఎం సతీమణి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-శోభ దంపతుల దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి కూతురుగా ముస్తాబయింది. మంగళవారం నాడు చరణ్ రెడ్డితో ప్రత్యూషకు..

Cm Kcr Adopted Daughter: పెళ్లి కూతురుగా ముస్తాబయిన సీఎం కేసీఆర్ దత్తపుత్రిక.. పట్టు బట్టలు, గోల్డ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించిన సీఎం సతీమణి..
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2020 | 6:15 AM

Share

Cm Kcr Adopted Daughter: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-శోభ దంపతుల దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి కూతురుగా ముస్తాబయింది. మంగళవారం నాడు చరణ్ రెడ్డితో ప్రత్యూషకు వివాహం జరగనుండగా, నేడు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లి కూతురుని చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాజరయ్యారు. నవ వధువు ప్రత్యూషకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సహా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల్‌ పాటిగడ్డ గ్రామంలోని లూర్దు మాత దేవాలయంలో చరణ్ రెడ్డి-ప్రత్యూష పెళ్లి రేపు(ఈనెల 28న) జరగనుంది. క్రైస్తవ సంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పెండ్లి వేడుక కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రత్యూష పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక గత అక్టోబర్ నెలలో చరణ్‌రెడ్డి, ప్రత్యూషల నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ ప్రేమ వివాహం కాగా, ప్రత్యూష ముందుగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిపింది.

Also read:

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు

Grand Welcome To Baby Girl : బుజ్జితల్లి ఇంట అడుగుపెట్టిన శుభ ముహూర్తాన మనసులు ఎంత పులకించెనో !