CM KCR: మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలతోపాటు..

ఇవాళ మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు సమాచారం అందించింది. 5 గంటలలోపు ప్రగతి భవన్‌ చేరుకోవాలని మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి.

CM KCR: మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. తాజా రాజకీయ  పరిణామాలతోపాటు..

Updated on: Jun 10, 2022 | 11:21 AM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K.Chandrasekhar Rao) ఇవాళ మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు సమాచారం అందించింది. 5 గంటలలోపు ప్రగతి భవన్‌ చేరుకోవాలని మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్‌ లీడర్లు హాజరుకానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితోపాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం అవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. మద్దతిచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలి.. అనే అంశంపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.