Telangana News: గంజాయి మత్తులో రెచ్చిపోయిన స్నేహితులు.. వారిపై వారే దాడి చేసుకుని..

|

Oct 31, 2021 | 8:30 AM

Telangana News: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు.

Telangana News: గంజాయి మత్తులో రెచ్చిపోయిన స్నేహితులు.. వారిపై వారే దాడి చేసుకుని..
Arrest
Follow us on

Telangana News: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలో ఆరుగురు స్నేహితులు గంజాయి తాగారు. ఆ తరువాత మత్తులో జారుకున్న వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. వివాదం తీవ్రమవడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫోన్ దొంగతనం చేశారంటూ వారిలో వారే కొట్టుకున్నారు. రాళ్లు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన యువకులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘర్షణపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు యువకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివాదంపై స్థానికులను ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటూ విచారిస్తున్నారు. గంజాయి సేవించినందుకు ఈ ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Pawan Kalyan: నేడు విశాఖలో పర్యటించనున్న జనసేనాని.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న జనసేనాని..

Viral Video: క్కక పిల్లలు చేసిన పనికి నెటిజన్స్‌ ఫిదా.! అసలేం చేశాయో మేరే చూడండి.. వీడియో

Ind Vs Pak: బాబర్ మ్యాచ్ ఆడుతుంటే.. అతడి తల్లి వెంటిలేటర్‎పై ఉంది.. అసలు ఏం జరిగిందంటే..