Telangana: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక‌.. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా..

|

Sep 28, 2022 | 3:29 PM

సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దసరా కానుకను ప్రకటించారు. సింగరేణి కంపెనీ లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు.

Telangana: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక‌.. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా..
CM KCR and Singareni Workers
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి కంపెనీ లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించారు. దసరాలోపు కార్మికులకు స్పెషల్ బోనస్ అందించాలని సింగరేణి కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన కార్మికుల కోసం రూ.368 కోట్లు చెల్లించనుంది సింగరేణి కంపెనీ. సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరంలో పొందిన లాభాల్లో 30 శాతం వాటాను.. సింగరేణి ఉద్యోగులకు అందించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరమున్నదన్నారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా..

2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని నిర్ణయించిన‌ సీఎం కేసీఆర్‌కు ఉద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు 368 కోట్ల రూపాయలను అందించనుండటం గొప్ప విషయమన్నారు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం