CM KCR: ప్రగతి భవన్‌లో జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజ.. ఆయుధ పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

|

Oct 05, 2022 | 12:35 PM

మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి..

CM KCR: ప్రగతి భవన్‌లో జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజ.. ఆయుధ పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్
CM KCR Special Pooja at Pragathi Bhavan
Follow us on

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇప్పుడు పాన్‌ ఇండియా పార్టీగా మారనుంది..టీఆర్ఎస్‌ నుంచి బీఆర్ఎస్‌కు అప్‌డేట్‌ అవుతోంది..అందుకే బలాన్ని పెంచుకునే దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు..ఎంతోమందితో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే గులాబీ బాస్..ఈ నిర్ణయానికి వచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

భారత్‌ రాష్ట్ర సమితికి బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన వెంటనే ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు గులాబీ దళాధిపతి..పాన్‌ ఇండియా పార్టీ ఏర్పడ్డాక..నేతలకు జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వస్తాయని..వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరపున ఇన్‌ఛార్జులుగా పనిచేసే అవకాశం లభిస్తుందని కేసీఆర్‌ చెబుతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం