Bandi Sanjay: అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదు: బండి సంజయ్

| Edited By: Velpula Bharath Rao

Nov 08, 2024 | 5:11 PM

కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు.

Bandi Sanjay: అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదు: బండి సంజయ్
Central Minister Bandi Sanjay Fires On Cm Revanth Reddy And Ktr
Follow us on

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరం సహా అన్ని స్కాంల్లో కేటీఆర్ ప్రధాన నిందితుడని తేలిన తరువాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు సీఎం రేవంత్‌ను జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగిరేశారని జైల్లొ పెట్టారని, మరి రేవంత్ కేటీఆర్‌ను ఎందుకు జైల్లో పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగకుండా పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేశాడని, తాము ఫైటర్స్ అని, అందుకే కేటీఆర్‌కు నిద్రలో కూడా తాము గుర్తుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడుకుతో కలిసిపోయారని, పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటించి.. రాత్రి ఒక్కటై పోతున్నారంటూ విమర్శించారు. కేటీఆర్ పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పనైపోయిందని, వారికి గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని సంగెం వద్ద మూసీ కోసం పాదయాత్ర చేయడం కాదు .. ఇళ్లు కూల్చే చోట చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల విషయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌తో పోలిస్తే  హరీష్ రావు క్రెడిబిలిటీ ఉన్న లీడర్ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి