AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. అక్కడ అతి పెద్ద మెగా ఎయిర్‌పోర్ట్.. శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుంది. ఈ మేరకు కేంద్రం ముందడుగు వేసింది. దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. జూన్‌లోగా ఈ ఎయిర్‌పోర్ట్ కోసం శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు..

Telangana: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. అక్కడ అతి పెద్ద మెగా ఎయిర్‌పోర్ట్.. శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..
Adilabad Airport
Venkatrao Lella
|

Updated on: Apr 09, 2026 | 8:57 AM

Share

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో అతి పెద్ద మెగా ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని అంతర్గాం ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఎయిర్‌స్ట్రిప్ ఉండగా.. దీనికి అనుసంధానంగా ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణశాఖ ఆధ్వర్యంలో 300 ఎకరాలు ఉండగా.. దీనిని అనుకుని భూసేకరణ చేపట్టనున్నారు. రక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించనున్నారు. సివిల్ ఏవియేషన్, రక్షణశాఖ జాయింట్ వెంచర్‌గా దీనిని నిర్మించాలని భావిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్

తాజాగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై చర్చించారు. జాయింట్ వెంచర్ కోసం సిద్దంగా ఉందని రక్షణ శాఖ సిద్దంగా ఉందని ఈ భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 17న సివిల్ ఏవియేషన్ అధికారులు క్షేత్రస్ధాయి పరిశీలనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాల భూమి సేకరించి ఇవ్వాల్సి ఉందని, భూసేకరణకు ఇబ్బంది లేదని ప్రభుత్వం తెలిపిందన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, అక్కడ నిర్మించేందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఉందని, అన్నీ అనుకూలతలు అక్కడ ఉందన్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయిచిందని, భూసేకణ ప్రక్రియ కొనసాగుతోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్

ఇక కొత్తగూడెం ఎయిర్ పోర్ట్‌పై ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అటు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌కు భూసేకణ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చిందన్నారు. అటు ఇటీవల జూన్ 2లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కూడా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అక్కడ అతిపెద్ద పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో