Huzurabad By-Election: హుజురాబాద్‌లో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..పార్టీలకు షాక్

|

Oct 22, 2021 | 9:37 AM

అక్కడ ఎన్నికల హడావుడి చూస్తుంటే.. ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది ఏదో జరుగుతుందని. ఉపఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌కి సరిగ్గా అదే ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుంది. అందుకే బైపోల్ ఎలక్షన్స్‌ జరిగే చోట ..ఎన్నికల నిర్వాహణ, కోడ్‌ అమలుపై అధికారులు డేగ కన్ను వేయాలని ఆదేశించింది.

Huzurabad By-Election:  హుజురాబాద్‌లో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..పార్టీలకు షాక్
Huzurabad By Election
Follow us on

ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలోని జిల్లా అంతటా నియమావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేల్లోనూ ఈ రూల్స్ అప్లై అవుతాయని ప్రకటిచింది ఈసీ. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో జరుగుతున్న హంగామాతో సమ్‌థింగ్‌ ఈజ్ రాంగ్ అన్న సంకేతాలు ఇస్తోంది. ఈసీ అమలు చేసే ఎన్నికల కోడ్‌ని కేవలం నియోజకవర్గ పరిధిలోనే పాటిస్తూ…చుట్టూ పక్కల గ్రామాలు, జిల్లాల నుంచి యధేచ్చగా ధనప్రవాహం కొనసాగుతున్నాయనే సందేహాన్ని వ్యక్తం చేసింది.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. ఉపఎన్నికల్లో ఎన్నికల కమిషన్ విధించిన రూల్స్ నియోజకవర్గాలకే పరిమితం కాదని.. సమీపంలోని జిల్లాలు, ఇతర మండలాల్లో వర్తింపజేసే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించింది ఈసీ. ఉపఎన్నికలు జరుగుతున్న చోట ఎన్నికల ప్రవర్తాన నియమావళి, కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఉపఎన్నికల్లో ప్రభావితం చేసే విధంగా ప్రత్యక్ష పాత్ర పోషించకుండా చూడాలని అధికారులకు తెలిపింది. నియోజకవర్గ పరిధి అవతల కూడా రాజకీయ కార్యకలాపాలు జరగడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని.. ఖర్చుకు సంబంధించిన వాటిపై కూడా అబ్జర్వేషన్‌ తప్పని సరిగా ఉండాలని జిల్లా అధికారుల్ని ఆదేశించింది ఈసీ.

Also Read: పత్తి చేను మాటున గుట్టుగా వ్యవహారం.. దాడులు చేసిన అధికారులు షాక్

Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు