కుల బహిష్కరణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

|

Sep 21, 2019 | 2:41 PM

తమను అకారణంగా కులం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ..వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది ఓ కుటుంబం. జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన చిలువేరు రామచంధ్రు- కోమురమ్మ కుటుంబంపై కొందరు వ్యక్తిగత కక్షసాధిస్తున్నారని ఆందోళనకు గురవుతున్నారు. గత 20 సం లుగా గ్రామంలో కుల పెద్దమనిషి గా చెలామణి అవుతున్నామనే నెపం తో తమను కులం నుంచి మూడేళ్లుగా బహిష్కరించి కులం లో జరిగే ఏ కార్యక్రమాలకు హాజరు కాకుండా చేస్తున్నారని, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని […]

కుల బహిష్కరణపై కలెక్టర్‌కు ఫిర్యాదు
Follow us on

తమను అకారణంగా కులం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ..వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది ఓ కుటుంబం. జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన చిలువేరు రామచంధ్రు- కోమురమ్మ కుటుంబంపై కొందరు వ్యక్తిగత కక్షసాధిస్తున్నారని ఆందోళనకు గురవుతున్నారు. గత 20 సం లుగా గ్రామంలో కుల పెద్దమనిషి గా చెలామణి అవుతున్నామనే నెపం తో తమను కులం నుంచి మూడేళ్లుగా బహిష్కరించి కులం లో జరిగే ఏ కార్యక్రమాలకు హాజరు కాకుండా చేస్తున్నారని, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా ఆరేళ్ల పాప చనిపోతే కూడా కుల పెద్దమనుషులు ఎవరు రాలేదని, వచ్చిన వారికి కూడా జరిమానా విధిస్తూ భయబ్రాంతులకు గురిచేసిన పోతర్ల సమ్మయ్య, బెల్లీ కొత్తకోమురయ్య, జక్కుల సోమయ్య, బెల్లీ గణేష్, పిడుగు వెంకన్న, జక్కుల కుమారస్వామి ల పై స్థానిక రాయపర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని చెప్పారు. అయినా పోలీసులు తమ గోడు పట్టించుకోవటం లేదని అందుకే తమకు న్యాయం కావాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని  కుల కట్టుబాట్ల మూలంగా తాము గ్రామంలో అవమానంతో బతుకుతున్నామని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు కుల గౌరం ప్రసాదించాలని ఆవేదనతో భార్య భర్తలు కోరుతున్నారు.