TRS Vs BJP: బండి సంజయ్ సహా.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై కేసులు: నల్లగొండ ఎస్పీ రంగనాధ్

|

Nov 16, 2021 | 7:21 PM

TRS Vs BJP: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన మరోసారి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు

TRS Vs BJP: బండి సంజయ్ సహా.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై కేసులు: నల్లగొండ ఎస్పీ రంగనాధ్
Sp Ranganath
Follow us on

TRS Vs BJP: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన మరోసారి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం కూడా బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆత్మకూర్(ఎస్) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఘర్షణలో పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు. బండి సంజయ్ పర్యటన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారన్న కారణంతో కేసులు పెట్టినట్లు ఎస్పీ రంగనాధ్‌ ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో అనుమతి తీసుకోకుండా పర్యటించడం సరికాదన్నారు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపద్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై, టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.

బండి సంజయ్ ఐకెపి కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో జరిగిన ఘర్షణల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పూర్కొన్నారు. బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం చివరి నిమిషంలో లేఖ ఇచ్చారన్నారు.

నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకెపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని, ముందస్తు సామాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

Also Read:

Bandi Sanjay: బండి సంజయ్‌ పర్యటనలో మళ్లీ హైటెన్షన్.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు..

Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు.. డీకే అరుణ సంచలన కామెంట్స్..!